హరికృష్ణ మరణంతో అబిడ్స్ బంద్

abids bandh over harikrishna died

టీడీపీ సీనియర్‌ నేత, నటుడు నందమూరి హరికృష్ణ హఠాన్మరణం.. యావత్‌ తెలుగు రాష్ట్రాలను దిగ్బ్రాంతికి గురిచేసింది. ఎన్టీఆర్‌ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన..తనదైన శైలితో అభిమానులను సంపాదించుకున్నారు. ఇక అయన మృతితో అబిడ్స్ లోని ఆహ్వానం హోటల్ పరిసర ప్రాంతాలలో విషాదఛాయలు అలుముకున్నాయి .కాంప్లెక్స్ లోని థియేటర్ మరియు హోటల్ బాధ్యతలను చూసుకుంటే ఎక్కువ సమయం హోటల్ లొనే ఉండేవారని అక్కడ పని చేసే వారు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన అకాల మృతితో కాంప్లెక్స్ లోని థియేటర్ లు , పలు షాపులు మూసివేసి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.