హరికృష్ణ నివాసానికి చేరుకున్న భువనేశ్వరి..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి భార్య హరిక‌ృష్ణకు సోదరి అయిన భువనేశ్వరి, కుమార్తె బ్రహ్మణి హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు. నల్గొండ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణ వార్తను విన్న కుటుంబసభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. హైదరాబాదులోని మసాబ్‌ట్యాంకు దగ్గర ఉన్న హరికృష్ణ నివాసానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు.