హరికృష్ణ మృతి.. ఆ కారణంగానే ఘోరం జరిగిపోయింది..

cause-of-harikrishna-accident

మాజీ ఎంపీ, టీడీపీ నేత, నటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. అయితే అయన సీటు బెల్టు ధరించని కారణంగానే మృతి చెందినట్టు తెలుస్తోంది. అయన ప్రయాణిస్తున్న కారు అంతలా ప్రమాదం జరగడానికి గల కారణాలు, ప్రయాణించిన ఫార్చూనర్ కారులో ఏ విధమైన సేఫ్టీ సిస్టమ్స్ ఉన్నాయనే విషయాలు చూస్తే.. ముఖ్యంగా హరికృష్ణ ప్రయాణించిన కారు టయోటా ఫార్చూనర్.. ఇందులో సేఫ్టీ సిస్టమ్స్.. ఎయిర్ బ్యాగ్స్, సెన్సార్ , అలాగే సీటు బెల్టు ఇండికేషన్ సిస్టమ్స్ వంటివి ఉన్నాయి. వెహికల్ ప్రమాదానికి గురైయినప్పుడు వెంటనే సెన్సార్ ఆన్ అవుతుంది. ఎయిర్ బ్యాగ్స్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతాయి. దాంతో ప్రయాణికులు ఎయిర్ బ్యాగ్స్ లో చిక్కుకుని ప్రమాదం నుంచి బయటపడతారు. అంతేకాకుండా డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ కచ్చితంగా పాటించవలసింది సీటు బెల్టు పెట్టుకోవడం.. సాధారణంగా కారులో డ్రైవర్ కానీ ఇతర ప్రయాణికులు కానీ ప్రయాణించేటపుడు ఒకవేళ సీటు బెల్టు పెట్టుకోని పక్షంలో ఒక అలారం ఇస్తుంది. అప్పుడు అలెర్ట్ అయి వెంటనే సీటు బెల్టు పెట్టుకోవాలి.. ఆలా కాకుండా కొందరు డ్రైవర్లు సీటు బెల్టు అలారం ను లాక్ చేస్తున్నారు. తద్వారా సీటు బెల్టు పెట్టుకోవడం మరిచి ప్రమాదం బారిన పడుతున్నారు. నటుడు హరికృష్ణ ప్రమాదం కూడా ఇదే కోవలో జరిగింది.హరికృష్ణ డ్రైవింగ్ సమయంలో సీటు బెల్టు ధరించలేదు. ఈ క్రమంలో ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్టు వేగంగా కారు నడుపుతున్న హరికృష్ణ సడన్ గా వాటర్ బాటిల్ కోసం వెనక్కి తిరిగారు. దాంతో రెప్పపాటులో ముందున్న వాహనాన్ని ఢీకొట్టి డివైడర్‌ను తాకి ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢికొట్టింది. హరికృష్ణ కారు గాల్లో పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. హరికృష్ణ దాదాపు 25 అడుగుల దూరంలో ఎగిరిపడటంతోనే ఘోర ప్రమాదం జరిగింది. అయితే ప్రమాద సమయంలో సీటు బెల్టు ధరిస్తే కారు సీటునుంచి వేరుకాకుండా ఉండే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. దురదృష్టవశాత్తు హరికృష్ణ సీటు బెల్టు ధరించని కారణంగా ఘోరం జరిగిపోయింది.