హరికృష్ణ రోడ్ యాక్సిడెంట్‌పై ప్రత్యక్ష సాక్షి కథనం..

ఘోర రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మరణించడం అభిమానులను తీవ్రంగా కలచి వేస్తుంది. అయితే ఈ రోడ్డు యాక్సిడెంట్‌కు ప్రత్యక్షసాక్షి.. తను ప్రాణాలతో బయటపడ్డ విషయాన్ని వివరిస్తూ హరికృష్ణ కారు తన కారుని ఢీకొట్టబోయిన విషయాన్ని వివరించాడు. చైన్నైనుంచి ఐదుగురం కారులో హైదరాబాదుకు వస్తున్నాం. కారును నేనే డ్రైవింగ్ చేస్తున్నా. ఉదయం 6 గంటల సమయంలో మేము 80 కిలోమీటర్ల వేగంతో వస్తుంటే మాకు ఎదురుగా వస్తున్న హరికృష్ణ కారు అదుపు తప్పి 14 అడుగుల మేర గాల్లో ఎగిరి మా వైపు దూసుకువచ్చింది.

అది గమనించి నేను నా కారును ఎడమవైపుకు తిప్పాను. లేదంటే హరికృష్ణ కారు మా కారు మీద పడాల్సింది. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని కారులోని వారంతా సురక్షితంగా ఉన్నాము. క్షణ కాలంలో ఎడమవైపుకు తిప్పడంతో చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాము. కుడివైపు కూర్చున్న వ్యక్తికి, నాకు చిన్న చిన్న గాయలయ్యాయి. మేము లేచి చూసే సరికి రోడ్డు మీద వెళ్తున్న వారు హరికృష్ణ గారిని గుర్తించి రోడ్డు మీద పడుకోబెట్టారు. ఆ తరువాత యాక్సిడెంట్ సమాచారాన్ని పోలీసులకు అందించారు అని ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న వ్యక్తి వివరించారు.