హైదరాబాదుకు హరికృష్ణ కుమార్తె సుహాసిని ..

బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి హరికృష్ణ మరణ వార్తను తెలుసుకున్న కుటుంబసభ్యులు హైదరాబాదులో ఉన్న ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. కాకినాడలో ఉంటున్న ఆయన కుమార్తె సుహాసిని హైదరాబాదుకు బయలుదేరారు. హరికృష్ణకు ముగ్గురు కుమారులు జానకి రామ్, కళ్యాణ్ రామ్, తారక రామ్, కుమార్తె సుహాసిని. నాలుగేళ్ల క్రితం జానకి రామ్ రోడ్ యాక్సిడెంట్‌లో మృత్యువాతకు గురైన విషయం తెలిసిందే.