నందమూరి హరికృష్ణ మృతికి దేవిశ్రీప్రసాద్ పాటతో సంతాపం

music directer devisri prasad pays tribute to harikrishna by nannaku prematho song

నందమూరి హరికృష్ణ మృతిపట్ల ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంతాపం తెలిపారు. అమెరికాలో టూర్ లో ఉన్న ఆయన నందమూరి హరికృష్ణ కుటుంబ సభ్యులతో తనకు ఉన్న సన్నిహిత సంబంధాన్నిగుర్తుచేసుకున్నారు. నాన్నకు ప్రేమతో అనే పాటపాడి తన శ్రద్దాంజలి ఘటించిన దేవిశ్రీప్రసాద్, తాను సెప్టెంబర్ 1వ తేదీన డాలస్ లో నిర్వహించే మ్యూజికట్ నైట్ ను నందమూరి హరికృష్ణకు అంకితమిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హరికృష్ణ మృతికి దేవిశ్రీప్రసాద్ తోపాటు గాయకులు, ఎన్నారైలు సంతాపం తెలియజేశారు.