రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మృతి

నల్గొండ జిల్లా రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మృతి చెందారు. నల్గొండలోని 12వ పటాలం వద్ద హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు బోల్తాపడింది. తెల్లవారుజామున నాలుగు గంటలకు హైదరాబాద్‌ నుంచి నెల్లూరు బయల్దేరిన హరికృష్ణ స్వయంగా కారు నడుపుతున్నట్టు సమాచారం. కారు వేగంగా వెళ్తున్న సమయంలో ముందు వెళ్తున్న కారును ఢీకొని అదుపుతప్పి బోల్తాపడింది. అటు గుంటూరు నుంచి వస్తోన్న మరో కారును ఢీకొంది. ఈ ఘటనలో హరికృష్ణతోపాటు మరో ఇద్దరు ఉన్నారు.