హరికృష్ణ మరణం: సమంత ట్వీట్.. నెటిజన్స్ ఫైర్

అమ్మా.. సమంతా ముందు పెద్దల్ని ఎలా గౌరవించాలో నేర్చుకో తల్లీ.. అంటూ నెటిజన్స్ అందాల తార సమంతపై విరుచుకు పడుతున్నారు. నందమూరి హరికృష్ణ మృతికి సంతాపం తెలుపుతూ పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. అయితే సమంత చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ‘రిప్ హరికృష్ణ ‘(రెస్ట్ ఇన్ పీస్ హరికృష్ణ) అంటూ ట్వీట్ చేసింది. హరికృష్ణను ‘గారు’ అని సంబోధించలేదు.

దాంతో నెటిజన్స్ చేతిలో అడ్డంగా బుక్కయింది సమంత. వెంటనే ముందు పెట్టిన పోస్ట్‌ని డిలీట్ చేసి మళ్లీ ‘రిప్ హరికృష్ణ గారూ’ అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఓ సినిమా ఫంక్షన్ కోసం తాను చెన్నైలో ఉన్నానని, ఈ వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసింది అంటూ హరికృష్ణగారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పింది.