విషాదంలో సినీ ఇండస్ట్రీ.. టీజ‌ర్‌, ట్రైల‌ర్ రిలీజ్‌లు వాయిదా

harikrishna

మాజీ రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు నందమూరి హరికృష్ణ మరణం పెను విషాదాన్ని నింపింది. సినీ ప్రరిశ్రమకు చెందిన ప్రముఖులుత‌మ సంతాపాన్ని తెలియ‌జేస్తూ కుటుంబానికి ప్ర‌గాడ సానుభూతి తెలియ‌జేస్తున్నారు. జగపతిబాబు, డైరెక్టర్ త్రివిక్రమ్, వంశీ పైడిపల్లి ఆస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

బుధవారం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో చైతూ, అను ఎమ్మాన్యుయేల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన శైల‌జా రెడ్డి అల్లుడు ట్రైల‌ర్‌తో పాటు విశాల్ న‌టించిన పందెం కోడి 2 టీజ‌ర్ విడుద‌ల కావ‌ల‌సి ఉండ‌గా అవి వాయిదా పడ్డాయి. పందెం కోడి టీజ‌ర్‌ని గురువారం విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

ఇక శైలజా రెడ్డి అల్లుడు చిత్ర ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్‌ని త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామ‌ని మూవీ యూనిట్ తెలిపింది.

ఇక అక్కినేని నాగార్జున కూడా త‌న బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ జ‌రపొద్దని ఫ్యాన్స్ తెలిపిన‌ట్టు స‌మాచారం.