హరికృష్ణ మృతితో పెళ్లి మండపంలో విషాద ఛాయలు

హరిక‌ృష్ణ మృతితో పెళ్లి మండపంలో విషాదం అలుముకుంది. సినీ నటుడు టిడిపి సీనియర్ నేత హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారని తెలిసి ఆయన మిత్రుడు మోహన్‌ దిగ్ర్భాంతికి గురయ్యారు. తన కుమారుడి పెళ్లికి వస్తాడనుకున్న హరికృష్ణ ఆకస్మిక మరణవార్త విని భోరున విలపించారు. దీంతో నెల్లూరు జిల్లా కావలిలోని బృందావన్‌ కళ్యాణమండపంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

నెల్లూరు జిల్లా కావలిలో జరగనున్న తన ఫ్రెండ్ కుమారుడి వివాహానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. తలకు బలమైన గాయం అవడంతో స్పాట్‌లోనే విపరీతంగా రక్తశ్రావమైంది. 108 రప్పించి ఆయన్ను కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లేప్పటికే పరిస్థితి విషమంగా మారిపోయింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం అయిన కారణంగా.. ఆయన చికిత్సకు స్పందించకపోవడంతో పరిస్థితి క్షణక్షణానికీ దిగజారింది. చివరికి బుధవారం ఉదయం ఏడునలభైకి చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు.