తీవ్ర విషాదంలో వైసీపీ ఎమ్మెల్యే

ycp mla kodali nani shak over harikrishna death

బుధవారం తెల్లవారుజామున నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీ, సినీనటుడు నందమూరి హరికృష్ణ దుర్మరణం చెందారు. అయన మృతితో కుటుంబసభ్యులు, నందమూరి అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. కుమారులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ తండ్రి భౌతికాయాన్నిచూసి ఇక మాకు దిక్కెవరంటూ ఏడ్చారు. కాగా అన్న మృతిచెందడంతో తమ్ముడు బాలకృష్ణ కన్నీటిపర్యంతమయ్యారు.

 ycp mla kodali nani shak over harikrishna death

ఇదిలావుంటే నందమూరి కుటుంబానికి వీరవిధేయుడిగా పేరున్న వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని హరికృష్ణ మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. 25 ఏళ్లుగా నందమూరి కుటుంబంతో కొడాలి నానికి ప్రత్యేక అనుబంధం ఉంది. నందమూరి ఇంట జరిగే ప్రతికార్యక్రమంలో నాని కచ్చితంగా వుండాలసిందే.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకముందు నాని ఇంటికి వచ్చేవాడు. నానిని ఎన్టీఆర్.. సొంత అన్నగా భావించేవాడు. గతంలో ఎన్టీఆర్ హీరోగా హరికృష్ణ, నాని లు కలిసి ఓ సినిమాను నిర్మించాలని అనుకున్నారు. అది కుదరలేదు. కానీ కొడాలి నాని సమర్పణలో ఎన్టీఆర్ హీరోగా సాంబ చిత్రం తెరకెక్కింది.

-ADVT-