అంగరంగ వైభవంగా మంత్రి అఖిల ప్రియ, భార్గవ్‌రామ్‌ల పెళ్లి

akhila-priya

ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ ఓ ఇంటివారయ్యారు. భార్గవ రామ్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. ఆళ్లగడ్డలో అంగరంగ వైభవంగా జరిగిన వివాహ మహోత్సవానికి పలువురు రాజకీయ ప్రముఖుల హాజరయ్యారు. నూతన వధు వరు వరులను ఆశీర్వహించారు. అఖిల వివాహం సందర్భంగా ఆళ్లగడ్డలో సందడి వాతావరణం నెలకొంది.

 

ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ, వ్యాపార వేత్త భార్గవ్‌రామ్‌ల వివాహం ఘనంగా జరిగింది. బాజాభజంత్రీలు, వేద పండితుల మంత్రాల మధ్య.. సరిగ్గా ఉదయం 10.57 నిమిషాలకు అఖిలప్రియ, భార్గవ్‌రామ్‌ల జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యింది.

 

ఆళ్లగడ్డలోని కోటకందుకూరు మెట్టు వద్ద ఉన్న భూమా శోభానాగిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబసభ్యులు, బంధువులు హాజరయ్యారు. అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువులు, మంత్రులు నారాయణ, కాలువ శ్రీనివాసులు హాజరై వధువరులను ఆశీర్వదించారు.

వివాహ వేడుక ఏర్పాట్లును అఖిల ప్రియ మేనమేమ.. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, సోదరుడు.. ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి పర్యవేక్షించారు. నందమూరి హరికృష్ణ హఠాన్మరణంతో.. గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు సహా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖలు వివాహా కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు.