ఆసియా క్రీడల్లో భారత షట్లర్ల ప్రదర్శన సంతోషాన్నిచ్చింది : కోచ్ పుల్లెల గోపీచంద్

asian-games-pullela-gopichand-proud-of-saina-nehwal-and-pv-sindhus-performances

ఆసియా క్రీడల్లో భారత షట్లర్ల ప్రదర్శన సంతోషాన్నిచ్చిందని కోచ్ పుల్లెల గోపీచంద్ వ్యాఖ్యానించారు. ఆసియా క్రీడల్లో తొలిసారి రెండు పతకాలు సాధించిన సింధు, సైనాలతో పాటు గోపీ నగరానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా అంచనాలకు తగ్గట్టే వీరిద్దరూ రాణించారని చెప్పారు. మరోవైపు తనకు ఫైనల్ ఫోబియా లేదని పివి సింధు చెప్పింది. ఆసియా క్రీడల ఫైనల్లో వరల్డ్ నెంబర్ వన్ చేతిలో ఓడిన సింధు రజతంతో సరిపెట్టుకుంది. అయితే గత కొంత కాలంగా పలు మేజర్ టోర్నీల్లో సింధు ఫైనల్ అడ్డంకిని అధిగమించలేకపోతోంది. అటు సైనా కూడా ఆసియా క్రీడల్లో కాంస్యం గెలవడం సంతృప్తినిచ్చిందని తెలిపింది.