హౌస్‌లో హత్యలు.. ట్విస్ట్‌ ఇచ్చిన బిగ్‌బాస్

బుల్లి తెరపై బిగ్‌బాస్ రియాలిటీ షో ప్రేక్షకుల్లో జోష్‌ని తీసుకువస్తుంది. హౌస్‌లో ఇచ్చే లగ్జరీ బడ్జెట్ టాస్క్‌తో షో మరింత రసవత్తరంగా మారుతుంది.గత ఎపిసోడ్‌లో ‘మర్డర్ మిస్టరీ’ పేరుతో టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో మర్డర్ మిస్టరీని పసిగట్టే డిటెక్టివ్ పాత్రలో గణేష్, మిస్టరీని ఛేదించే పోలీస్ ఆఫీసర్‌గా రోల్ రైడా ఉన్నారు. గీతా మాధురి హంతకురాలిగా ఉంది. ఇక మిగిలిన సభ్యులు పబ్లిక్‌గా ఉన్నారు.

హత్యల్ని ఎవరు చేస్తున్నారో కనిపెట్టాల్సిన టాస్క్‌లో డిటెక్టివ్ గణేష్ పూర్తిగా విఫలం అయ్యాడు. ఇక పోలీస్ రోల్ రైడా గీతపై అనుమానం వ్య‌క్తం చేసినా రుజువు చేయ‌లేక‌పోయాడు. అయితే బెడ్‌పై పసుపు పడేయ‌డం వ‌ల‌న గీతా మాధురే వ‌రుస హ‌త్య‌లు చేస్తుంద‌ని అందరూ నిర్ణ‌యానికి వచ్చారు. అదే స‌మ‌యంలో గీతా మాధురి బిగ్ బాస్ ఇచ్చిన 5 సీక్రెట్ టాస్క్‌లు పూర్తి చేసింది.

సీక్రెట్ టాస్క్‌లో గీతా మాధురి విజ‌యం సాధిస్తే ఎలిమినేష‌న్ నుండి త‌ప్పించుకోవ‌డంతో పాటు సీజన్ మొత్తం నచ్చిన వారిని ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు అని స‌డెన్‌గా బిగ్ బాస్ ట్విస్ట్‌ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. దీంతో సీక్రెట్ టాస్క్‌లో గీత విజ‌యం సాధించ‌డంతో ఆమె ఎలిమినేష‌న్ నుండి త‌ప్పించుకుంది. దీంతో గీత ఎవ‌రిని ఎలిమినేట్ చేస్తుందా అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది.

బిగ్ బాస్ హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన కౌశ‌ల్‌నే ఎంపిక చేసుకునే అవకాశాలు ఉన్నాయని బుల్లితెర ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. ఒక వేళ ఆమె కౌశ‌ల్‌ని ఎంపిక చేసుకుంటే ఈ సీజన్ మొత్తానికి ఆయ‌న ఎలిమినేషన్‌లో ఉండ‌నున్నాడు. మ‌రి కౌశ‌ల్ ఆర్మీ అత‌న్ని ఎన్ని వారాలు సేవ్ చేస్తారో చూడాలి.