హరికృష్ణకు తీరని చివరి కోరిక..

కొడుకులు పెరిగి పెద్దవాళ్లయ్యారు. వారి వారి రంగాల్లో ముందుకు వెళుతున్నారు. అంతకంటే తండ్రికి కావలసింది ఏం ఉంటుంది. తనకి ఎంతో ఇష్టమైన కళా రంగం సినీ ఇండస్ట్రీలో ఉన్న కొడుకులు తారక్, కళ్యాణ్‌రామ్‌లతో కలిసి తనకి నటించాలని ఉందని సినీ వర్గాల వారితో అంటుండేవారు. కుటుంబసభ్యుల వద్ద కూడా ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో ప్రస్తావిస్తుండేవారు. తండ్రి కోరికను తీర్చేందుకు కళ్యాణ్ రామ్ ప్రయాత్నాలు మొదలు పెట్టినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.

నందమూరి మల్టీస్టారర్ కోసం మంచి స్క్రిప్ట్‌ని సిద్దం చేయమంటూ ఇప్పటికే పలువురు రచయితలకు సూచించినట్లు తెలిసింది. ఇంతలోనే ఆయనను మృత్యువు ఈ రూపంలో ముంచుకొచ్చింది. తన కోరిక కలగానే మిగిలిపోయింది. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ హరికృష్ణ చిన్నతనంలోనే పలుచిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి బిజీగా మారడంతో సినిమాల్లో నటించడానికి వీలు కాలేదు. రాను రాను రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ వచ్చారు. మళ్లీ సినిమాల్లో నటించాలనే కోరిక కలిగింది. అది తీరకుండానే జీవితం ముగిసిపోయింది.

Video : Jr NTR, Kalyan Ram Cries at His Father’s Cremation