హరికృష్ణ అంతిమయాత్ర ..భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు

నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి చేరుకుంది. మెహిదీపట్నం, టోలీచౌకీ, షేక్ పేట్ నాలా మీదుగా గంటన్నర పాటు అంతిమయాత్ర సాగింది. అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. అంతిమ యాత్రలో సీఎం చంద్రబాబు.. హరికృష్ణ భౌతిక కాయం వెన్నంటే ఉన్నారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్యెల్యేలు, సినీ రాజకీ ప్రముఖులు మహాప్రస్థానానికి చేరుకున్నారు. హరికృష్ణకు కడసారి వీడ్కోలు పలికేందుకు.. పార్టీలకు అతీతంగా నేతలు తరలివచ్చారు. ప్రియమైన నేతకు చివరిసారి చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.