హరికృష్ణ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది : ఎం.పి టి.సుబ్బరామి రెడ్డి

mp-t-subbaramireddy-pays-tribute-to-harikrishna

మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి, సినీ నటులు శ్రీ నందమూరి హరికృష్ణ మరణ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు రాజ్యసభ సభ్యులు టి.సుబ్బరామి రెడ్డి. ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉండగా పలుమార్లు కలిసేవాళ్ళం. స్నేహానికి ప్రాణం ఇచ్చే వ్యక్తి శ్రీ హరికృష్ణ గారు. తెలుగు భాష అంటే ఆయనకు ప్రాణం. హరికృష్ణ గారు మరణం కుటుంబ సభ్యుణ్ణి కోల్పోయినట్టుగా ఉంది. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. శ్రీ హరికృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ విషాద సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్ళే శక్తి ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను అని టి.సుబ్బరామి రెడ్డి అన్నారు.