‘నర్తనశాల’ మూవీ రివ్యూ

narthanasala movie review

రివ్యూ : @నర్తనశాల
తారాగణం : నాగశౌర్య, కశ్మీరా, యామినీ భాస్కర్, శివాజీరాజా, జయప్రకాష్ రెడ్డి, అజయ్, సుధ
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ : విజయ్ సి కుమార్
నిర్మాత : ఉషా మూల్పురి
దర్శకత్వం : శ్రీనివాస చక్రవర్తి

హీరోగా నిలబడాలని చాలాకాలంగా ట్రై చేసిన కుర్రాడు నాగశౌర్య. కొన్ని హిట్స్ వచ్చినా అవేవీ అతనికి క్రేజ్ తేలేకపోయాయి. దీంతో తనే నిర్మాతగా ఛలో అంటూ సూపర్ హిట్ కొట్టాడు. తర్వాత మరో రెండు సినిమాలు వేరే బ్యానర్ లో వచ్చినా అవవీ ఆడలేదు. ఈ నేపథ్యంలో తన బ్యానర్ లోనే రెండో ప్రయత్నంగా చేసిన @నర్తనశాలతో వచ్చాడు. రిలీజ్ కు ముందే కాస్త హైప్ తెచ్చుకున్న ఈ సినిమా ఇవాళ విడుదలైంది. మరి ఛలో స్తాయిలో ఆకట్టుకుందా లేదా.. అంచనాలైనా అందుకుందా లేదా అనేది చూద్దాం..

కథ :
కళామందిర్ కళ్యాణ్(శివాజీరాజా)కు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. ఆడపిల్ల పుట్టాలని బలంగా కోరుకుంటాడు.కానీ అతనికి కొడుకు పుడతాడు. ఆ కొడుకునే ఆడపిల్లలాగా పెంచుతాడు. అలాగే పెరిగిన ఆ కుర్రాడు శౌర్య(నాగశౌర్య).. ఆడపిల్లలను సెల్ఫ్ డిఫెన్స్ నేర్పే స్కూల్ నేర్పుతుంటాడు. ఏ ఆడపిల్లకైనా ఇబ్బంది ఉంది అని తెలిస్తే వెంటనే వెళ్లి ఆదుకుంటాడు. అలాంటి తనకు ఓ అమ్మాయికి ఎదురైన ఇబ్బంది తొలగించాలనే రిక్వెస్ట్ వస్తుంది. తనకోసం వెళ్లి.. ఆమె ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. తర్వాత ఈ ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇదే టైమ్ లో ఓ బార్ లో మరో అమ్మాయి తనను కమెంట్ చేసిన నలుగురు కుర్రాళ్లపై ఫైట్ చేస్తుంది. ఆ ఫైట్ నచ్చిన శౌర్య ఆ అమ్మాయిని మెచ్చుకుని సెల్ఫీ తీసుకుంటాడు. కానీ తను అతన్ని ప్రేమిస్తుంది. ఈ ఫోటోలో ఆమె సెల్ఫీ చూసిన శౌర్య తండ్రి ఏకంగా అతనికి తెలియకుండా ఆ కుటుంబంతో సంబంధం కుదుర్చుకుంటాడు. ఆ సంబంధం చెడగొట్టుకోవడానికి తను ‘గే’ అని చెబుతాడు శౌర్య. మరి నిజంగానే శౌర్య గే నా.. లేక ఏదైనా కారణంతో అలా చెప్పాడా..? గే అని చెప్పిన తర్వాత అతనికి ఎదురైన సమస్యలేంటీ..? అనేది చూడాలి.

విశ్లేషణ :
తెలుగులో ఇప్పటి వరకూ చాలా పాయింట్స్ చుట్టూ కథలు వచ్చాయి. కానీ హీరోనే ‘గే’ అనే పాయింట్ ఎప్పుడూ టచ్ కాలేదు. మహాభారతంలో ఉన్నా అదొక సబ్ స్టోరీ మాత్రమే. అలాగే ఇప్పటి వరకూ ఈ పాత్రలు కమెడియన్స్ కు చూశాం. అలాంటిది ఫస్ట్ టైమ్ ఓ హ్యాండ్సమ్ హీరో ఇలాంటి పాత్ర చేస్తున్నాడంటే ఆడియన్స్ లో ఆసక్తి వచ్చింది. కానీ దాన్ని నిలబెట్టుకోవడంలో @నర్తనశాల పూర్తిగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. కానీ కావాల్సినన్ని నవ్వులు పంచుతుంది. తను ప్రేమించిన అమ్మాయి కోసం తను గే అని అబద్ధం చెప్పిన హీరో ‘మరో గే’ చేతిలో చిక్కుకుంటాడు. అప్పటి నుంచీ వీరి మధ్య వచ్చే సన్నివేశాలన్నీ ఫన్నీగా సాగుతాయి. ఈ కారణంగా తను ఆ ఇంట్లో చిక్కుకుంటాడు. ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తోన్న టైమ్ లో తను ప్రేమించిన అమ్మాయి కూడా ఆ ఇంటికే వస్తుంది. తను ఆ ఇంటి అమ్మాయే అయినా ఓ కారణంతో ఆ అమ్మాయిని ఇంట్లోకి రానివ్వరు సరికదా.. తననో దరిద్రంలా చూస్తుందా కుటుంబం. అందుకు కారణం కాస్త సిల్లీగా ఉన్నా.. హీరో ఆ ఇంట్లోనే ఆగిపోవడానికి కరెక్ట్ రీజన్ గా కనిపిస్తుంది. ఇక అప్పటి నుంచి కథంతా ఒకే ఇంట్లోకి మారుతుంది. ఇటు తను గే అవడం వల్ల మరో గేతో వచ్చే సమస్యలు ఫేస్ చేస్తూనే ఆ అమ్మాయిన ఇంట్లోవారికి దగ్గర చేయడం కోసం శౌర్య నానా తంటాలు పడుతుంటాడు. ఇందులో నుంచి కావాల్సినంత హాస్యం పండిస్తాడు దర్శకుడు. కొన్ని సీన్స్ మరీ సిల్లీగా అనిపించినా.. వాటినీ ఫన్ ఫిల్ గా ఫినిష్ చేస్తాడు. కాకపోతే ఈ పాయింట్ ను ఇంకాస్త అందంగా చెప్పొచ్చు. లేదా ఇంకాస్త కాన్ ఫ్లిక్ట్ తో ముగించొచ్చు. ఆ వైపు వెళ్లకుండా దర్శకుడు సింపుల్ గా పని కానిచ్చాడు. ఇది కాస్త నిరాశపరుస్తుంది. ఒకరకంగా చెబితే ఈ కథను జంధ్యాల స్థాయిలో నడిపించొచ్చు. మరెందుకో.. లైటర్ వే లో వెళ్లిపోయారు.
గే పాత్రలో నాగశౌర్య ఆశ్చర్యపరుస్తాడు. కాకపోతే ఛలోతో పోలిస్తే ఇందులో కాస్త నీరసంగా కనిపిస్తాడు. హీరోయిన్లిద్దరూ స్కిన్ షోతో ఆకట్టుకున్నారు. యాక్టింగ్ పరంగా వారికి పెద్దగా స్కోప్ లేదు. జయప్రకాష్ రెడ్డి బాగా నవ్వించాడు. అలాగే హీరో ఫ్రెండ్ కూడా ఫర్వాలేదు. ఇక అజయ్ పాత్ర సెటిల్డ్ గా ఉంటుంది. అతని నటన కూడా అంతే. ఇతర పాత్రల్లో శివాజీరాజా కాస్త అవసరానికి మించిన హడావిడీ చేశాడేమో అనిపిస్తుంది. ఇక ఇతర పాత్రలన్నీ రొటీన్ గా వచ్చి వెళ్లేవే..
టెక్నికల్ గా ఈ మూవీకి సినిమాటోగ్రఫీ హైలెట్. అందంగా ఉంటుంది. ఇక ఛలో సినిమాకు తన సంగీతంతో ప్రధాన బలంగా ఉన్న మహతి సాగర్ ఈ సినిమాకు ఆ స్థాయిలో కాకపోయినా ఫర్వాలేదనిపిస్తాడు. సింపుల్ లొకేషన్స్ తో ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా కనిపిస్తాయి. మాటలు ఆకట్టుకుంటాయి.

ప్లస్ పాయింట్స్ :
నాగశౌర్య
హీరోయిన్ల గ్లామర్
సినిమాటోగ్రఫీ
కామెడీ
ఇంటర్వెల్ బ్యాంగ్

మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్
సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్
రొటీన్ స్టోరీ
ఫైనల్ గా : @నర్తనశాల… నవ్వుల గోల