ఛాలెంజ్ విసిరిన జెనీలియా కొడుకు

ఈ మధ్య కాలంలో సెలబ్రెటీస్ రోజుకో ఛాలెంజ్‌తో సోషల్ మీడియాను ఉపేస్తున్నారు. స్వయంగా ఛాలెంజ్‌ని పూర్తి చేసి వాటిని సామాజిక మాధ్యమాలలో షేర్ చేసి ఇతర సెలబ్రిటీస్‌కి ఛాలెంజ్ విసురుతున్నారు. వారు టాస్క్ పూర్తి చేస్తున్న తీరును చూసి జనాలు ఎంతగా ఆకర్షితులు అవుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చాలెంజ్‌లు పెద్దలకే కాదు సెలబ్రెటీల పిల్లలకు పాకేసింది.

తాజాగా బచ్చేఫిట్‌తోదేశ్‌ఫిట్‌ అనే ఛాలెంజ్ వైరల్ అవుతుంది.తన తండ్రి రితేశ్‌ దేశ్‌ముఖ్‌ విసిరిన ఫిట్‌నెస్‌ ఛాలెంజ్ ను స్వీకరించిన రెండేళ్ల రెహిల్‌, తల్లి జెనీలియా పర్యవేక్షణలో తాడు సహయంతో గోడ మీదకి ఎక్కుతూ ఛాలెంజ్ పూర్తి చేశాడు.తర్వాత ఈ ఛాలెంజ్ ను బాలీవుడ్ స్టార్‌ కిడ్స్‌ తైమూర్‌, అబ్‌రామ్‌, ఆరాధ్య బచ్చన్‌, ఇనాయా ఖేము, మిషాలకు విసిరాడు.

జెనీలియా 2012 ఫిబ్రవరి 3న రితీష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ జంటకు 2014 లో రియాన్ అనే మగ బిడ్డ జన్మించాడు. ఇప్పుడు #బచ్చేఫిట్‌తోదేశ్‌ఫిట్‌’ అంటూ క్యాప్షన్‌ జత చేసి రెహిల్ వీడియోని షేర్ చేసింది జెనీలియా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.