గీత గోవిందం సినిమాకు విజయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా మారిపోయాడు. తాజాగా విడుదలైన గీత గోవిందం సినిమా సాధించిన వసూళ్ళతో విజయ్ 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు. దీంతో టాలీవుడ్‌లో తనకు ఉన్న భారీ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని విజయ్ తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచినట్టు తెలుస్తోంది. గీత గోవిందం సినిమాకు విజయ్ రూ.10కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. నాలుగైదు సినిమాలు చేసిన ఓ కుర్ర హీరోకు ఇంత పెద్ద మొత్తంలో పారితోషకం
పొందుతుండంతో నిర్మాతల వద్ద విజయ్‌కి ఉన్న డిమాండ్ ఏంటో తెలిసిపోతుంది. తన తర్వాత సినిమాలకు విజయ్ ఎంత డిమాండ్ చేసినా ఇవ్వడానికి నిర్మాతలు సిద్దంగా ఉన్నారు.