మంత్రాలయంలో బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ కీలక నేతల రహస్య సమావేశం

bjp and rss leads meet secretly in mantralayam

కర్నూలు జిల్లా మంత్రాలయంలో టీటీడీ ప్రవాస మందిరంలో బీజేపీ నాయకులు, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు రహస్యంగా సమావేశమయ్యారు. మంత్రాలయంలో మూడు రోజుల పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. మరోవైపు ఇదే సమయంలో బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ కీలక నేతలు రహస్యంగా సమావేశం కావడం చర్చనీయాంశమైంది..

ఆర్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షులు మోహన్‌ భగవత్‌ మొదట శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తరువాత పీఠాధిపతుల ఆశీస్సులు పొందారు..

టీటీడీ కళ్యాణ మండపంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధుల సమన్వయ కమిటీ సమావేశాన్ని మఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్ధులు ప్రారంభించారు. సభ ప్రారంభానికి ముందు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ అధ్యక్షుడు మోహన్‌ భగవత్‌ భేటీ అయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు 271 మంది ఈ సమావేశంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -