కూరలు తరిగే కత్తితో యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

ప్రేమించానన్నాడు.. ప్రేమించాలంటూ వెంటపడ్డాడు.. ఒప్పుకోలేదని దాడికి తెగబడ్డాడు. పబ్లిక్‌గానే ఆమెపై కత్తితో విరుచుకుపడ్డాడు. కూరలు తరిగే కత్తితో నరికేశాడు. వీడిలోని మానవ మృగాన్ని గుర్తించలేదని యువతి అక్కడికక్కడే ప్రాణాలొదిలింది.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ఐడీఏ బొల్లారంలో అందరూ చూస్తుండగా కత్తితో విచక్షణా రహితంగా విద్యార్థినిపై దాడి చేశాడు అరవింద్‌.

శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన తారకేశ్వరరావు ఉపాధి కోసం బొల్లారానికి వచ్చారు. వినాయకనగర్‌లో ఉంటూ స్థానిక పరిశ్రమలో పనిచేస్తున్నారు. వీరి ఇంటికి ఎదురుగా మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబం ఉంటోంది. తారకేశ్వరరావు కూతురు నికిత పదో తరగతి చదువుతోంది.. రెండేళ్లుగా బీటెక్‌ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థి అరవింద్‌ యువతి వెంట పడుతున్నాడు.. ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.. ఏం జరిగిందో ఏమో, గురువారం సాయంత్రం స్కూల్‌ నుంచి నికిత రాగానే అరవింద్‌ ఇంట్లోకి చొరబడి కత్తితో ఆమె గొంతు కోశాడు. కత్తిపోట్లతో రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది.. ప్రాణాలతో నికిత కొట్టుమిట్టాడుతుంటే అరవింద్‌ బయటికొచ్చి కూర్చున్నాడు.. చివరకు స్థానికులు మృగాణ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రక్తపు మడుగులో పడివున్న నికితను ఆస్పత్రికి తరలించారు.. అయితే ఆమె అప్పటికే చనిపోయింది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -