కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం… వైసీపీ సభ్యుడిని సస్పెండ్‌ చేసిన చైర్మన్‌

clash-between-tdp-ysrcp-councillors-tenali-municipal-council-meeting

తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాదోపవాదాలు, తోపులాటతో ఉద్రిక్తత ఏర్పడింది. పరిస్థితి ఒకరిపై ఒకరు చేయి చేసుకునే వరకు వెళ్లింది. సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు కూర్చీలను విసిరి గందరగోళం సృష్టించారని మున్సిపల్ ఛైర్మన్‌ పెండ్యాల వెంకట్రావ్ వైసీపీ కౌన్సిలర్‌ను సస్పెండ్‌ చేశారు. దీంతో సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ వైసీపీ కౌన్సిలర్లు సమావేశాన్ని బైకాట్‌ చేశారు. కౌన్సిలర్ ఛైర్మన్ వెంక్రరావు మాత్రం సమావేశంలో వైసీపీ సభ్యుల ప్రవర్తన సరిగ్గా లేకపోవడం వల్లే సభ్యున్ని సస్పెండ్ చేశానని అన్నారు.