పూర్తయిన హరికృష్ణ చిన్న కార్యం..

harikrishna-chinna-karyam-over-today

బుధవారం తెల్లవారుజామున నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీ, సినీనటుడు నందమూరి హరికృష్ణ మరణించారు. అయన మృతితో కుటుంబసభ్యులు, నందమూరి అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఇక అయన మరణించి మూడు రోజులు అయింది. దాంతో ఇవాళ చిన్న కార్యం జరిగింది. ఈ కార్యంలో ఇద్దరు కుమారులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లతో పాటు తమ్ముడు బాలకృష్ణ మరియు ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. అనంతరం అందరూ కలిసి భోజనం చేశారు.