ఫేస్‌బుక్‌లో అమ్మాయిలతో స్నేహం.. న్యూడ్‌గా ఫోటోల మార్ఫింగ్.. చివరకు..

face book crime

సోషల్‌ మీడియాతో అమ్మాయిలకు వల వేసి వారిని వేధిస్తున్న ఓ మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా స్నేహం పెంచుకొని, తర్వాత ఫోటోలు న్యూడ్‌గా మార్ఫింగ్ చేసి డబ్బుల కోసం వేధిస్తున్న విద్యాసాగర్‌రెడ్డిని కటకటాల్లోకి నెట్టారు. ఈ ఘటన హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో జరిగింది. ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన కేపీహెచ్‌బీ పోలీసులు చివరికి ఈ కంత్రీ ఆగడాలకు చెక్ పెట్టారు.

యాదాద్రి జిల్లా మోత్కూర్‌ మండలం బూజిలాపురానికి చెందిన మలిపెద్ది విద్యాసాగర్‌రెడ్డి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఐతే, ఈజీ మనీ కోసం రాంగ్ ట్రాక్ ఎంచుకున్నాడు. ఫేస్‌బుక్‌లో అమ్మాయిల్ని ట్రాప్ చేస్తూ.. మోసాలకు పాల్పడుతున్నాడు. ధనవంతుల కుటుంబాలకు చెందిన అమ్మాయిల్నే టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో వారితో ఫ్రెంఢ్‌షిప్‌ చేస్తున్నాడు. తర్వాత వాళ్ల ఫొటోలు అసభ్యంగా మార్ఫింగ్ చేసి వాటిని నెట్‌లో పెడతానంటూ బెదిరిస్తున్నాడు. ఇలా ఇప్పటికే ఐదుగురిని ట్రాప్ చేసి చీట్ చేశాడు. పెళ్లైన మహిళల్ని కూడా ఇలాగే వేధించినట్టు పోలీసులు గుర్తించారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -