కొద్దిసేపట్లో పెళ్లి.. అంతలోనే ప్రియురాలు ఝలక్

molestation-case-files-against-groom-banjarahills-hyderabad

కొద్దిసేపట్లో పెళ్లి జరుగుతుందనగా పెళ్లి కొడుక్కి ప్రియురాలి రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో పెళ్లి తంతు ఆగిపోయింది. నల్గొండ జిల్లాకు చెందిన యువతి ఐదేళ్ల కిందట హైదరాబాద్ వచ్చి సూపర్ మార్కెట్లో సేల్స్ గర్ల్ గా పనిచేస్తోంది. ఆమెకు కరీంనగర్ కు చెందిన ఆకుల నరేష్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కొంతకాలానికే ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఇందిరానగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని వారిద్దరు సహజీవనం చేస్తున్నారు. ఇటీవల నరేష్ కు ఇంట్లో వారు సంబంధాలు చూసి.. ఓ యువతితో పెళ్లి నిశ్చయించారు. అయితే నరేష్ ఆ యువతి ఫోటోను తన సెల్ ఫోన్ లో ఉంచుకున్నాడు. ఆ ఫోటోను నరేష్ ప్రియురాలు చూసి నిలదీసింది. అతను తన చెల్లెలు ఫోటో అని చెప్పాడు. కానీ ఆమెకు అనుమానం వచ్చి నరేష్ స్నేహితులను విచారించగా అతనికి మరో అమ్మాయితో పెళ్లి కుదిరిందని.. ఈనెల 30 న పెళ్లి అని సమాధానం ఇచ్చారు. దాంతో ఖంగుతిన్న యువతి వెంటనే కరీంనగర్ కు పెళ్లి మండపానికి వచ్చి పెళ్లి నిలుపుదల చేయించింది. అనంతరం పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.