పరదా చాటున ‘అందం’.. ఎవరో చెప్పుకోండి చూద్దాం

సెలబ్రెటీలు.. అందునా సినిమా తారలు ఏం చేసినా వార్తే.. ఎక్కడికి వెళ్లినా వార్తే.. అందరిలా బయట తిరగే అవకాశం లేదు. చుట్టుముట్టిన అభిమానులను కంట్రోల్ చేయడం కష్టం. మీడియా వేసే ప్రశ్నలతో వాళ్ల పర్సనల్ విషయాలు బయటకు వస్తాయన్న భయం కొంత. వెరసి ముసుగు ధరించక తప్పని పరిస్థితి.

శ్రియా శరన్ తిరుమల శ్రీవారిని దర్శిచుకోవడానికి తిరుపతి వచ్చారు. అందరిలా మామూలుగా వెళ్లలేదు ఈ అందాల సుందరి. తనను ఎవరూ గుర్తు పట్టకూడదని ముఖాన్ని డ్రెస్ చున్నీతో కప్పేసింది. అయినా కనిపెట్టేసాయి కెమేరా కళ్లు. దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్లే ముందు, వచ్చేముందు కూడా చున్నీ కప్పుకునే కనిపించింది శ్రియ. కొన్ని ఎంత దాచుదామన్నా దాగవు.. ముఖ్యంగా సెలబ్రెటీల విషయంలో చిన్న వార్త కూడా సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తుంది.

ఈ ఏడాది మార్చిలో రష్యన్ బాయ్ ‌ఫ్రెండ్ ఆండ్రీ కొశ్చివ్‌ని రహస్యంగా వివాహం చేసుకుంది. అయినా పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి. వివాహానంతరం కొద్ది రోజులు బ్రేక్ తీసుకుని మళ్లీ ఫేస్‌కి మేకప్ వేసుకుంది. సినిమాల్లో నటిస్తోంది. తాజాగా తాను నటిస్తున్న ‘వీరభోగ వసంత రాయలు’ షూటింగ్ చివరి దశలో ఉంది.