దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు ప్రతికూల ఓపెనింగ్‌!

stack-market

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు కొంతమేర ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 25 పాయింట్లు క్షీణించి 11,711 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. గురువారం ఆగస్ట్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల చివరి రోజు కావడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. వరుసగా రెండో రోజు కన్సాలిడేషన్ బాటలో సాగాయి.  ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 33 పాయింట్లు తక్కువగా 38,690 వద్ద నిలవగా… నిఫ్టీ 15 పాయింట్లు క్షీణించి 11,677 వద్ద స్థిరపడింది. అయితే చైనాతో వాణిజ్య వివాదాలకు మరోసారి ట్రంప్‌ ప్రభుత్వం కాలుదువ్వడంతో గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు నష్టపోయాయి. ఆసియాలోనూ ప్రతికూల ధోరణి కనిపిస్తోంది. దీంతో నేడు దేశీయంగానూ మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కదిలే అవకాశమున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

నిఫ్టీ కదలికలు ఇలా..! 
నేడు నిఫ్టీ బలహీనపడితే తొలుత 11,645 పాయింట్ల వద్ద, తదుపరి 11,613 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,704 పాయింట్ల వద్ద, తదుపరి 11,731 స్థాయిలోనూ రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. కాగా.. బ్యాంక్‌ నిఫ్టీకి 27,965, 27,828 పాయింట్ల వద్ద మద్దతు, 28,237, 28,371 స్థాయిల వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని పేర్కొంటున్నారు.ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో గురువారం సీన్‌ రివర్స్ అయ్యింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 958 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 1599 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కాగా.. బుధవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1416 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌ రూ. 1114 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

business link