ప్రియుడి ఇంటి ఎదుట యువతి మౌనదీక్ష

young-women-protest-front-b

ప్రేమించిన యువకుడు మోసం చేశాడంటూ యువతి ప్రియుడి ఇంటి ఎదుట మౌన దీక్షకు దిగింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగింది. అర్ధవీడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన ప్రియాంక చదువు పూర్తిచేసుకుని మార్కాపురంలో ఉద్యోగ పరీక్షకోసం శిక్షణ తీసుకుంటోంది. ఆమెకు మార్కాపురానికి చెందిన మహేష్‌ పరిచయమయ్యాడు. దీంతో వారు ప్రేమించుకున్నారు. అయితే ఇటీవల మహేష్.. తనను దూరం పెడుతున్నాడని.. పైగా పెళ్ళికి నిరాకరించాడని ఆమె చెబుతోంది. ఈ క్రమంలో అతని ప్రవర్తనకు నిరసనగా మహేష్ ఇంటిముందే దీక్షకు దిగింది. ప్రియాంక తల్లిదండ్రులు యాకోబు, రంగమ్మలు తమ కుమార్తెకు న్యాయం చేయాలని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.