విమానంలో దారుణం.. మహిళ మీద మూత్రం పోసి..

air-india-international-flight-drunken-man-peed-on-woman-passengers-seat

విమానంలో ఓ ప్రయాణికుడు తప్పతాగి ప్రయాణికురాలిపట్ల దారుణంగా వ్యవహరించాడు. ఆమె ముందే ప్యాంటు విప్పి ఆమెపై మూత్రం పోశాడు. ఈ అవమానకర సంఘటన న్యూయార్క్‌ నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో చోటుచేసుకుంది. దీనిపై బాధితురాలి కూతురు సదరు మంత్రికి ఫిర్యాదు చేసింది. శుక్రవారం అమెరికా.. జేఎఫ్‌కే విమానాశ్రయం నుంచి బయల్దేరిన మీ విమానం ఏఐ102లో మా అమ్మకు దారుణ అనుభవం ఎదురైంది. మద్యం సేవించిన ఓ ప్రయాణికుడు తన ప్యాంటు విప్పి ఆమె కూర్చున్న సీటుపై మూత్రం పోశాడు! ఒంటరిగా ప్రయాణిస్తున్న మా అమ్మ ఇది చూసి హతాశురాలైంది. దీనిపై సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా, ఈ ఘటనపై తగు చర్యలు సత్వరమే తీసుకోవాలని లేదంటే ఇలాంటి వారు రెచ్చిపోతారు’ అంటూ ట్విటర్ లో కేంద్ర విమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా దృష్టికి తీసుకెళ్లింది. అయన వెంటనే స్పందించి.. ఇలాంటి భయంకరమైన పరిస్థితి మీ తల్లిగారికి ఎదురవడం చాలా దురదృష్టకరం.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించి చర్యలు తీయూసుకుంటామని ఆమెకు బదులిచ్చారు.