భారత్ క్రీడాకారుల జయకేతనం.. ఆసియా క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన

భారత్ క్రీడాకారులు.. దేశ గౌరవాన్ని విశ్వవ్యాపితం చేస్తున్న ఆణిముత్యాలు. మారుమూల పల్లెల నుంచి వచ్చినా, అరకొర సౌకర్యాలు అడ్డంకిగా మారినా తమ సత్తా చాటుతూ, మేం భారతీయులం అని సగౌరవంగా ప్రపంచానికి చాటి చెబుతున్నారు. భారత కీర్తి పతాకాలను వినువీధిలో ఎగుర వేస్తున్నారు. ఇండోనేషియాలోని జకర్తా వేదికగా జరుగుతున్న 18వ ఆసియన్ క్రీడల్లో ఇప్పటివరకు గెలుచుకున్న పతకాలు 67.

ఆసియా క్రీడల్లో భారత్ గెలుచుకున్న అత్యధిక పతకాల సంఖ్య ఇదే కావడం విశేషం. 2010 తరువాత ఈ స్థాయిలో పతకాలు గెలుచుకోవడం ఇదే మొదటిసారి. ఆ ఏడాది భారత్ మొత్తం 65 పతకాలు సాధించగా అందులో 14 స్వర్ణపతకాలు గెలిచి ఆరోస్థానంలో నిలిచింది. అప్పటికి రికార్డులను బ్రేక్ చేస్తూ ఈ ఏడాది 67 పతకాలు గెలుచుకుంది. భారత మహిళా స్వ్వాష్ క్రీడాకారులు మలేషియాపై గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో స్వర్ణం సాధిస్తే కనుక భారత చరిత్రలోనే అత్యధిక స్వర్ణాలు సాధించినట్లవుతుంది. ఇప్పటి వరకు జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన పతకాల లిస్ట్ చూస్తే..
ఢిల్లీ వేదికగా జరిగిన తొలి ఆసియా క్రీడల్లో భారత్ గెలిచిన మొత్తం పతకాల సంఖ్య 51
1954లో 13 పతకాలు, 1958లో 14 పతకాలు, 1962లో 52 పతకాలు, 1966లో 21 పతకాలు, 1970లో 25 పతకాలు, 1974లో 28 పతకాలు, 1978లో 28 పతకాలు, 1982లో 57 పతకాలు, 1986లో 37 పతకాలు, 1990లో 23 పతకాలు, 1994లో 22 పతకాలు, 1998లో 35 పతకాలు, 2002లో 35 పతకాలు, 2006లో 53 పతకాలు 2010లో 65 పతకాలు, 2014లో 57 పతకాలు గెలుచుకుంది.