క్రికెట్‌ కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఆటగాడు

badrinath-announces-retirement-all-forms-cricket

క్రికెట్ కు మరో టీమిండియా ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించాడు. తానూ అన్నిఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించినట్టు టీమిండియా క్రికెటర్ బద్రీనాధ్ వెల్లడించారు. తమిళనాడుకు చెందిన 38 ఏళ్ల ఈ మిడిల్డార్‌ బ్యాట్స్‌మన్‌ రెండు టెస్ట్‌లు, ఏడు వన్డేలు, ఓ టీ-20లో భారత్‌ తరుపున ఆడాడు. 145 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 10,245 పరుగులు చేశాడు. అందులో 32 సెంచరీలున్నాయి. ఇప్పటికే బద్రీనాధ్ టీమిండియా తరుపున చివరి మ్యాచ్ ఆడి ఏడేళ్లు గడిచింది. కాగా కుటుంబంతో ఎక్కువ సేపు గడిపేందుకు క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పినట్టు బద్రీనాధ్ తెలిపాడు. అలాగే ఇప్పుడున్న ఆటగాళ్లు అందరూ ప్రతిభ కలిగిన వారని.. వారి ఆధ్వర్యంలో వచ్చే ప్రపంచ కప్ లో భారత్ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

badrinath-announces-retirement-all-forms-cricket