వివాహిత ఆత్మహత్య..

married-woman-commits-suicide-psr-nellore

వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. మనుబోలు మండలం చెర్లోపల్లికి గ్రామానికి చెందిన అల్లూరు సుబ్బయ్య, అల్లూరు సురేఖ(32) దంపతులు. వీరికి స్వరూప, వినయ్‌ అనే ఇద్దరు సంతానం. భార్యాభర్తలు జీవనోపాధి నిమిత్తం గూడూరు మండలం చెన్నూరులో ఉంటున్నారు. కొంతకాలంగా దంపతులమధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సురేఖ గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. సుబ్బయ్య మద్యం సేవించి భార్యను వేధించేవాడని అందువల్లే ఆత్మహత్య చేసుకుందని సురేఖ తల్లి పోలీసులకు చెప్పింది. కాగా ఇటీవల భర్తపై సురేఖ ఫిర్యాదు చేయడంతో గ్రామస్తులు సర్దిచెప్పి పంపారు.