మరణించింది ఆమె కాదు.. నేను.. : చిరంజీవితో..

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచారు దర్శకురాలు జయ. ఆమె మరణం తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు మెగా స్టార్ చిరంజీవి.

ఈ వార్త తెలిసిన వెంటనే ఆమె భర్త బీఏ రాజుకి ఫోన్ చేసి పలకరించగా ‘ మరణించింది నా భార్య కాదండి.. నేను’.. అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నా ఊహల్లో, నా ఆలోచనల్లో నా భార్య బ్రతికే ఉందంటూ ఆయన బాధపడిన తీరు తనను కలచివేసిందన్నారు.

అనంతరం.. చిరంజీవి జయతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. నాకు మంచి మిత్రురాలు, సోదర సమానురాలు. ఆమె భర్త.. వెయ్యికి పైగా సినిమాలకు పీఆర్వోగా పనిచేసిన రాజుతో మంచి అనుబంధం ఉంది. జయ దర్శకురాలిగానే కాకుండా రైటర్‌గా, సీనియర్ జర్నలిస్ట్‌గా పలు శాఖల్లో పనిచేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

జయ మరణం పరశ్రమకు తీరనిలోటు. జయ ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా.. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు చిరంజీవి.