పాతబస్తీలో అక్రమవడ్డీల పేరుతో దాడులు

old city man taken heavy intrest rates
బాధితుడు

హైదరాబాద్‌ పాతబస్తీలో అక్రమవడ్డీల పేరుతో కొందరు వ్యాపారులు.. సామాన్యులపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా వడ్డీ కోసం ఓ వ్యక్తిపై దాడికి తెగబడ్డాడు ఓ రౌడీషీటర్‌. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బర్కస్‌లో ఉండే అలీ బావాజీర్‌.. కొన్నాళ్ల క్రితం దావూద్‌ బాయ్‌ అనే వ్యకక్తి దగ్గర ఐదు లక్షల రూపాయలు వడ్డీకి అప్పు తీసుకున్నాడు. వడ్డీతో సహా ఇరువై లక్షల రూపాయలు చెల్లించినప్పటికీ.. ఇంకా డబ్బులు చెల్లించాలంటూ బావాజీర్‌పై దాడి చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. గాయాలపాలైన బాధితుణ్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.