పవన్‌కు చిరు బర్త్ డే విషెస్..కలవాలని అనుకున్నా కానీ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా అభిమానులు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పవర్ స్టార్‌కు శుభాకాంక్షలు తేలియజేస్తున్నారు. అలాగే మెగా హీరోలు రామ్ చరణ్ ,అల్లు అర్జున్ కూడా ..పవన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ‘ ‘కళ్యాణ్ బాబు నువ్వు అందుబాటులో లేవని తెలిసింది. కలవాలని అనుకొని విరమించాను. పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆ హనుమాన్ నీకు మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. – ఆశీస్సులతో అన్నయ్య చిరంజీవి’ అని మెగాస్టార్ తన తమ్ముడికి బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ విషెస్‌కు సంబంధించిన విషయాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేసింది.గత నెలలో జరిగిన మెగాస్టార్ పుట్టిన రోజు సంధర్భంగా పవన్ కుటుంబ సమేతంగా చిరు ఇంటికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు పవన్ పుట్టిన రోజు కావున చిరంజీవి స్వయంగా వెళ్లి ఆయనకు విషెస్ తెలియజేయాలి అనుకున్నప్పటికీ పవన్ అందుబాటులో లేకపోవడంతో లేఖ ద్వారా శుభాకాంక్షలు తేలిపారు.