పార్టీ ముఖ్యనేతల‌తో చంద్రబాబు స‌మావేశం..

cm-chandrababunaidu-meets-party-seniour-leaders-in-undavalli-prajavedhika

ఉండ‌వ‌ల్లి ప్రజావేదికలో పార్టీ ముఖ్యనేతల‌తో అధినేత చంద్రబాబు స‌మావేశం నిర్వహించారు. ఇటీవలి పరిణామాలపై చర్చించారు. మొన్న జరిగిన టీడీపీ హమారా సభలో కొంతమంది ప్లకార్డులు ప్రదర్శించడం, ఆ అల్లర్ల వెనుక వైసీపీ కుట్ర ఉందని టీడీపీ భావిస్తోంది.. ముస్లింలు తమవైపు మళ్లడాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షం అక్కసు వెళ్లగక్కుతోందని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ కుట్రల ట్రాక్ రికార్డు అందరికీ తెలిసిందేనన్న బాబు.. తునిలో రైలు దగ్దం చేసి ఆ నేరం అమాయకులైన కాపులపైకి నెట్టాలని చూసిన సంఘటనలను గుర్తు చేశారు. గుంటూరు టీడీపీ మైనారిటీ సదస్సుకు నంద్యాల నుంచి వైసీపీ కార్యకర్తలను పంపటమేంటని ప్రశ్నించారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండటానికే జగన్మోహన్ రెడ్డి తగడని చంద్రబాబు ఆన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇటువంటి పెడధోరణులన్నీ వైసిపి ఆవిర్భావం తరువాతే జరుగుతున్నాయన్న ఆయన, టిడిపి కార్యక్రమాల నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. అలాగే ఈ నెల 6నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

టీడీపీ నిర్వహిస్తున్న వివిధ సదస్సుల సందేశం ఆయా వర్గాల ప్రజలకు చేరువ అయినప్పడే వాటి సార్ధకతని నేతలకు దిశానిర్థేశం చేశారు. నారా హమారా-టిడిపి హమారా సదస్సు సందేశాన్ని గ్రామగ్రామానికి తీసుకెళ్లాలని సూచించారు. ముస్లింల సంక్షేమానికి తీసుకున్న చర్యలపై మైనారిటీలను పెద్దఎత్తున చైతన్యపరచాలన్నారు. మేనిఫెస్టోలో అన్ని హామీలను కేవలం 50నెలల్లోనే నెరవేర్చడం ఒక రికార్డుగా సీఎం అభివర్ణించారు. ప్రభుత్వ పథకాల లబ్దిని పొందడంలో అవగాహన పెంచాలని, టీడీపీకి అండగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించాలని తమ్ముళ్లకు సూచించారు చంద్రబాబు. నెల్లూరు దళిత తేజం సదస్సు సందేశం కూడా అన్ని ఎస్సీ కాలనీలకు తీసుకెళ్లాలని ఆదేశించారు. ఎస్సీల అభ్యున్నతికి చేపట్టిన చర్యలపై ప్రచారం ఉధృతం చేయాలన్నారు. 100యూనిట్ల ఉచిత విద్యుత్, ఎన్టీఆర్ విదేశీ విద్య, సబ్ ప్లాన్ లకు బడ్జెట్ పెంపు, కార్పోరేషన్ ద్వారా లబ్ది, స్వయం ఉపాధి, రుణమేళా గురించి వివరించాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లలో జలకళ ఉట్టిపడుతోందన్న చంద్రబాబు… అన్ని రిజర్వాయర్లలో దాదాపు 60శాతం చేరిందన్నారు. సకాలంలో ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలను పూర్తిచేయడం మంచిదైందన్నారు. రాయలసీమలో తొలిసారిగా చెరువులు నింపామని గుర్తు చేశారు. నదుల అనుసందానం, ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడం, భూగర్భ జలాలు పెంచడం, సూక్ష్మ సేద్యం అభివృద్ధి ప్రణాళికా క్రమంలో చేపట్టామని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా త్వరలోనే శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లను సందర్శించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. నాగార్జున సాగర్ కుడికాలువ ఆయకట్టుకు నీరు రావడంతో రైతుల్లో ఆనందం నెలకొందన్న ఆయన, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో దీనిపై పార్టీపరంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

-ADVT-