తండ్రి డీసీపీ.. కూతురు ఎస్పీ.. కూతురికి సెల్యూట్ చేసిన తండ్రి

dcp-selute-sp-in-pragathi-nivedhanasabha

ఏ తండ్రైనా పిల్లలు తనకంటే మంచి జీవితాన్ని పొందాలని కోరుకుంటాడు. అలాగే పిల్లల ఎదుగుదల చూసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. ఇక కూతురు తన పై అధికారిని అయితే ఆ సంతోషం అంతా ఇంతా కాదు. కొంగర కలాన్ లో తెరాస ప్రగతినివేదన సభ సాక్షిగా ఓ తండ్రి తన కూతురిని చూసి లోలోపల పొంగిపోయాడు. కూతురు తన పై.. అధికారి హోదాలో ఉంది. దీంతో ఆమెకు సెల్యూట్ చేసి ఆనందంతో పొంగిపోయాడు మల్కాజ్ గిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ. యాదృచ్చికంగా తండ్రీకూతుర్లు ఇద్దరు రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్ లో జరుగుతున్న ప్రగతి నివేదన సభ బందోబస్తు కోసం వచ్చారు. ఈ సందర్బంగా ఉమామహేశ్వరరావు ఎస్పీ సింధూశర్మకు సెల్యూట్ చేశారు. 1985 లో ఎస్సైగా ఉద్యోగంలో చేరిన ఉమామహేశ్వర రావు వివిధ హోదాల్లో పనిచేశారు. అనంతరం నాన్ క్యాడర్ ఎస్పీగా ఎంపికై మల్కాజ్ గిరి డీసీపీగా పనిచేస్త్తున్నారు. అయన కుమార్తె సింధూశర్మ 2014 ఐపిఎస్ బ్యాచ్ కు ఎంపికై.. ప్రస్తుతం జగిత్యాలలో ఎస్పీగా పనిచేస్తున్నారు.