మద్యం సేవించి భార్యభర్తలు మృతి

గుంటూరు జిల్లాలో కల్తీ మద్యం కాటేసింది. ఇద్దరు బలయ్యారు. కర్లపాలెం మండలం యాజిలి శివారులో భార్యాభర్త మద్యం తాగారు. అది వికటించడంతో చనిపోయారు. వాళ్లు గుంటూరుకు చెందిన అంజయ్య, మరియమ్మగా గుర్తించారు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిన్న రాత్రి వాళ్లు మద్యం తాగినట్టు పోలీసులు చెప్తున్నారు. వాంతులు అవడంతో బాపట్ల ఏరియా ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయిందని చెప్పారు. కల్తీ లిక్కర్ కారణంగానే వాళ్ల ప్రాణాలు పోయాయని అనుమానిస్తున్నారు. ఆ కోణంలో విచారణ మొదలైంది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -