పొదుపు : ప్రధానమంత్రి నివాసంలో ఉన్న ఖరీదైన కార్లను వేలం వేయాలని నిర్ణయం

imran-khan-s-govt-executes-austerity-drive-to-auction-pm-house-s-luxury-cars+world-imran-khan-s-govt-executes-austerity-drive-to-auction-pm-house-s-luxury-cars

ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు నుంచే పొదుపు మంత్రం పఠిస్తున్నారు ఇమ్రాన్ ఖాన్‌… ఖర్చులు తగ్గించుకోవాలని, పొదుపు చేయాలని ప్రమాణస్వీకారం చేసిన రోజే వెల్లడించారు… విలాసాలకు తాను బద్ద వ్యతిరేకినని స్పష్టం చేశారు… అనవసర ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా దేశాన్నిఆర్థికంగా పరుగులు పెట్టిద్దామని పిలుపునిచ్చారు.

తాజాగా ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ఉన్న అత్యంత ఖరీదైన కార్లను వేలం వేయాలని నిర్ణయించారు ఇమ్రాన్‌… 8 బీఎండబ్ల్యూ కార్లు, నాలుగు మెర్సిడీస్ బెంజ్ కార్లు ఉన్నాయి. అలాగే 16 టయోటా కార్లు, నాలుగు బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్రూజర్ వాహనాలు, హోండా కారు, మూడు సుజుకీ వాహనాలు, 1994 మోడల్‌కు చెందిన హినో బస్ వేలం వేసే వాహనాల జాబితాలో ఉన్నాయి. వీటన్నింటినీ ఈ నెల 17న ప్రధాని నివాసంలోనే వేలం వేయనున్నారు.

గతంలోని ప్రధానులు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు… అధికారిక నివాసంలో దాదాపు 80 వాహనాలు, 524 మంది సిబ్బంది ఉండేవారు… కానీ ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధాని అయ్యాక అధికారిక నివాసాన్ని ఆయన త్యజించారు… కేవలం మూడు పడకగదుల ఇంట్లో ఉంటూ.. ఇద్దరు సర్వెంట్లను మాత్రమే ఉండాలని తెలిపారు.