జగన్‌ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన

jagan prajasankalpa yatra in chodavaram
చోడవరం సభలో మాట్లాడుతున్న జగన్

విశాఖ జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర జోరుగా సాగుతోంది. జగన్‌ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. మామిడిపాలెం మీదుగా గంధవరం దగ్గర చోడవరం నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశించింది. అక్కడి నుంచి దుడ్డుపాలెం జంక్షన్‌, ముద్దుర్తి జంక్షన్‌, వెంకన్నపాలెం, గోవాడ గజపతినగరం మీదుగా.. జగన్‌ చోడవరం చేరుకున్నారు. ఇప్పటివరకు 2859 కిలోమీటర్లు నడిచారు.

కొత్తూరు జంక్షన్‌ దగ్గర బహిరంగ సభలో ప్రసంగించిన జగన్‌.. చంద్రబాబు పాలనపై విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న త్రినాథ్‌ మృతికి చంద్రబాబు కారణం కాదా అని ప్రశ్నించారు. కేంద్రం వెనక్కి తగ్గినప్పుడే టీడీపీ బయటకు వచ్చి ఉంటే.. హోదా వచ్చేది కాదా అని నిలదీశారు. ఇప్పుడు ధర్మపోరాటం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

ఇవాళ చోడవరం నియోజకవర్గంలోని నైట్‌ క్యాంప్‌ నుంచి జగన్‌ పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడ్నుంచి చోడవరం, రేవల్లు, కందిపల్లి క్రాస్‌, లక్కవరం క్రాస్‌, గవరవరం, ములకలపల్లి వరకు పాదయాత్ర కొనసాగుతుంది.