ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. యువతి సేఫ్..

lovers-suicide-attempt-rajampet-ysr-kadapa-district

కుటుంబసభ్యులు తమ పెళ్ళికి ఒప్పుకోలేదన్న కారణంగా ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన కడప జిల్లాలో జరిగింది. కడపకు చెందిన ఖాసింబీ, విజయవాడకు చెందిన సిద్దయ్య కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమ విషయం ఇరుకుటుంబాల పెద్దలకు మందలించారు. ఈ క్రమంలో పెళ్ళికి కూడా నిరాకరించారు. దాంతో మనస్థాపం చెందిన సిద్దయ్య , ఖాసింబీ.. రాజంపేట రైల్వే స్టేషన్ స్సమీపంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ సిద్దయ్య మృతిచెందగా.. గాయపడిన ఖాసింబీని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.