పసిపిల్లల్ని చంపి ప్రియుడితో పరారైన మహిళ

mother-kills-kids-and-elopes-lover

ప్రియుడి మోజులో పడి కడుపున పుట్టిన కొడుకు, కుమార్తెను అంతమొందించిందో కర్కోటకురాలు. చెన్నైకి చెందిన మహిళ ఈ దారుణానికి పాల్పడింది. చెన్నై పల్లావరం కుండ్రత్తూర్‌కి చెందిన విజయ్‌(34) బ్యాంక్‌ ఉద్యోగి అతనికి అభిరామి(28) భార్య , వారికీ అజయ్‌(5) అనే కుమారుడు, కారుణ్య(4) అనే కుమార్తె ఉన్నారు. మూడు నెలల కిందట అభిరామికి స్థానిక బిర్యానీ హోటల్ లో పనిచేసే సుందరం అనే యువకుడితో పరిచయం ఏర్పరుచుకుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహేతరసంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో భర్తకు తెలియకుండా సుందరంను కలుస్తూ ఉండేది అభిరామి. అయితే వీరి వ్యవహారం ఇరుగుపొరుగు వారికీ తెలిసి భర్త విజయ కు చెప్పారు. అతను ఆమెను మందలించాడు. ఇదే విషయమై భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదిలావుంటే శుక్రవారం బ్యాంక్‌లో పని అధికంగా ఉంటుందని, ఆలస్యంగా వస్తానని భార్యతో చెప్పి విజయ్‌ బ్యాంకుకు వెళ్ళాడు. రాత్రి ఇంటికి వచ్చిన అతడు… ఇంటి తలుపులు మూసివుండడం, ఇంట్లో లైట్లు వెలుగుతుండడంతో తన వద్ద ఉన్న మరో తాళంతో తలుపులు తెరిచి లోపలికి వెళ్ళాడు. ఇంట్లో ఇద్దరుపిల్లలు నోట్లోనుంచి నురగలు కక్కుకుని విగతజీవులుగా పడి ఉన్నారు. పిల్లల్ని అలా చూసి హతాశుడైన విజయ్ వెంటనే భార్యకోసం చూశాడు. ఆమె ఇంట్లో లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కాగా పోలీసు దర్యాప్తులో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారన్నకారణంగా తల్లే ప్రియుడితో కలిసి పిల్లలకు పాలల్లో విషం కలిపి అంతమొందించినట్టు తేలింది. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.

mother-kills-kids-and-elopes-lover