ప్రజాస్వామ్యంలో నిజమైన ప్రభువులు ప్రజలే

KESHAVA RAO
KESHAVA RAO

తెరాస ప్రగతినివేదన సభ అట్టహాసంగా ప్రారంభమైంది. సభలో మొదటిగా ఎంపీ కె.కేశవరావు మాట్లాడుతూ..తెరాస ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకే ఈ సభను ఏర్పాటు చేశాం. ప్రజాస్వామ్య వ్వవస్థలో నిజమైన ప్రభువులు ప్రజలే అన్నారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రసగిస్తూ మిషన్‌ భగీరథ, హరితహారం, కంటి వెలుగు లాంటి కార్యక్రమాలు గురించి ప్రధాని సహా ఇతర రాష్ట్రాల నేతలు ఆలోచిస్తున్నరంటే అది కేసీఆర్‌ గొప్పతనం. ప్రగతి నివేదన సభ చరిత్రలో నిలిచిపోతుందిన్నారు. మహ్మద్ అలి మాట్లాడుతూ షాదీముబారక్, కళ్యాణలక్ష్మీ లాంటి ఫథకాలను అమలు చేసిన ఘనత ఘనత కేసీఆర్‌‌దే అన్నారు. తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని,ముస్లింల అభివృద్ది కోసం కేసీఆర్‌ 2వేల కోట్ల ఏర్పాటు చేయడం సంతోషం అన్నారు