బాబాయ్ కి వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన అబ్బాయి

ram-charan-special-gift-pawan-kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్బంగా అబ్బాయి మెగా పవర్ రామ్ చరణ్ బాబాయికి వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు. నిన్న(శనివారం) కారులో వెళుతూ రేపటి రోజు బాబాయికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాననిచెప్పిన చెర్రీ.. ఇవాళ ఓ సాహసోపేతమైన అడ్వెంచర్ చేసి బాబాయ్ కి జన్మదిన శుభకాశాలు తెలియజేశాడు. ఎత్తైన కొండలమధ్య పారాగ్లైడింగ్‌ చేసి ఆవీడియోను ట్విటర్ లో షేర్ చేశాడు అందులో ‘ప్రియమైన బాబాయ్‌.. సినిమాల్లో.. జీవితంలో రిస్క్‌ చేసే ధైర్యాన్ని మీరు నాకిచ్చారు. అందుకే ఇది మీ కోసం. తొలిసారి పారాగ్లైడింగ్ చేస్తున్నా’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు రామ్‌ చరణ్‌.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -