నాయకులు.. రోడ్లు ఊడ్చేస్తున్నారు.. ఎలాగో మీరే చూడండి

road cleaning by politisions

నాయకులు రోడ్లు ఊడుస్తున్నారంటే ఎంత ప్రచారం చెయ్యాలి.. కెమేరాలకు పని చెప్పాలి. మీడియా వాళ్లకు కబురు చెయ్యాలి. కొత్త చీపుర్లు, డస్ట్‌బిన్‌లు కొనాలి. అన్నింటికీ మించి ఓ మంచి రోడ్డుని సెలక్ట్ చేసుకుని ఆల్డ్రెడీ కొంత క్లీన్ చేసి కొంచెం మాత్రమే చెత్తను ఉంచాలి. ఎంత సేపు ఫొటోలకు ఫోజులివ్వాలన్నది ముందుగానే టైమ్ ఫిక్స్ చేసుకోవాలి. వెరసి నాయకులు చీపుర్లు పట్టుకోవడానికి రెడీ అవుతారు. నాయకులు వస్తున్నారంటే ఆ దారిలో రోడ్డు సరిగా లేదంటే రాత్రికి రాత్రే రోడ్డు కూడా వేసేస్తారు. మరి ఈ హంగామా ఎక్కడైనా ఒకేలా ఉంటుంది.

అక్కడ కూడా టెంట్ వేశారు. చీపుర్లు పట్టారు. కానీ చెత్త లేకపోయేసరికి కెమేరా ఫోకస్ అవుతున్న విషయం మరిచి పోయి ముందుగానే సిద్దం చేసి పెట్టుకున్న డస్ట్ బిన్‌లోని చెత్తను కింద పడేసి మరీ ఊడుస్తున్నారు. అనుకోకుండా కెమేరాకు చిక్కారు. అదండీ సంగతి.. మరింక రోడ్లు ఎట్లా బాగుపడతాయంటే మీ ఇంట్లోని చెత్తను తీసుకెళ్లి వీధుల్లో వేయకండి. ఆ వీధుల వెంట రోజూ మనతో పాటు మరికొందరు నడవాలి. కొన్ని జీవితాలు రోడ్ల పక్కనే తెల్లవారుతుంటాయి.