దేశం కాని దేశం వెళ్లి.. అప్పు తీర్చలేక యువకుడు ఆత్మహత్య

satish-suicide-gulf

ఉపాధికోసం దేశంకానీ దేశం గల్ఫ్ వెళ్లి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన చెన్నమేని అంజయ్య–ఎల్లవ్వ దంపతుల ఏకైక కుమారుడు సతీశ్‌(30), కుమార్తె ఉన్నారు. గతంలో రెండుసార్లు అంజయ్య, సతీష్ గల్ఫ్ వెళ్లి తిరిగి వచ్చారు. అయితే గత కొంతకాలంనుంచి అప్పులు బాధ భరించలేక సతమతమవుతున్నారు తండ్రీకొడుకులు. ఈ క్రమంలో అప్పుచేసి ఆరునెలల క్రితం సతీశ్‌ బహ్రెయిన్‌ వెళ్లగా, తండ్రి దోహాఖతార్‌ వెళ్లాడు. అయితే ఇద్దరికి తక్కువ రాబడితో ఇబ్బంది పడుతున్నారు. ఈ చాలిచాలని వేతనాలతో అప్పులు ఎలా తీర్చాలో అని సతీష్ తన భార్యతో చెప్పుకుని మధనపడేవాడు. అయితే శుక్రవారం రాత్రి సతీష్ కు తల్లి, భార్య రాజ మణి, వీడియో కాల్ చేశారు ఇద్దరు కొడుకులు చూస్తుండగానే గదిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు. వారు వద్దని ఎంత వారించినా వినకుండా వారి కళ్లెదుటే ఆత్మహత్య చేసుకున్నాడు సతీశ్‌. దీంతో ఎలా కాపాడాలో తెలియక కుటుంబసభ్యులు రోదిస్తూ ఉండిపోయారు.