“మా” లో చీలిక.. శివాజీ రాజా Vs నరేష్

‘మా’ లో విభేదాలు తారస్థాయికి చేరాయి. చిరంజీవి ముఖ్య అతిథిగా యుఎస్ లో నిర్వహించిన కల్చరల్ పోగ్రామ్స్ లో మూడు కోట్ల నిధులు తారు మారు అయ్యాయని ‘మా’ జనరల్ సెక్రటరీ నరేష్ చేసిన అభియోగం పై శనివారం అర్ధ రాత్రి వరకు చర్చలు జరిగాయి. ‘మా’ అసోసియేషన్ చర్చలు అర్ధరాత్రి వరకూ జరగడం ఇదే మొదటిసారి. అధ్యక్షుడు శివాజీరాజా , జనరల్ సెక్రటరీకి మద్య విభేదాలు తారస్థాయికి చేరాయి. దీంతో నరేష్ ఈ కార్యవర్గ సమావేశానికి ‘బౌన్సర్స్ ’ తో రావడం చూస్తుంటే ఈ చర్చలు ఎలాంటి వాతావరణంలో జరిగాయో అర్ధం అవుతుంది. ఇప్పుడంతా బాగుంది అసలు ఏం జరగలేదు.. మేమంతా బాగానే ఉన్నాం అని బయటకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా,కొద్ది రోజుల్లో ఈ విభేదాలు రోడ్డు మీదకు వస్తాయని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.