ముగిసిన క్యాబినెట్ భేటి.. . సమావేశంలో పలు కీలక నిర్ణయాలు

తెలంగాణ క్యాబినెట్ భేటి ముగిసింది.అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకుంటారని ఊహాగానాలు వేలుపడిన నేపథ్యంలో ఆ అంశం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేబినెట్‌ సమావేశం తర్వాత మంత్రులు మీడియాతో మాట్లాడారు.ఈ భేటిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఆత్మగౌరవ భవనాలు, గోపాల మిత్రులకు వేతనం రూ. 3,500 నుంచి రూ. 8500 పెంపు, అర్చకుల పదవీ విరమణ వయసు 58 నుంచి 65 ఏండ్లకు పెంపు, ఆశా కార్యకర్తల గౌరవ వేతనం రూ. 6 వేల నుంచి 7500లకు పెంచుతూ నిర్ణయం, వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న సెకండ్ ఏఎన్‌ఎంలుకు రూ.11 వేల నుంచి రూ. 21 వేలకు పెంచినట్లు మంత్రులు వెల్లడించారు ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలను మాత్రమే తీసుకున్నామని కడియం శ్రీహరి తెలిపారు. త్వరలోనే మరోసారి క్యాబినెట్ భేటీ జరగనుంది. ఆ క్యాబినెట్ భేటీలో అన్ని నిర్ణయాలు తీసుకుంటామని కడియం స్పష్టం చేశారు.