ఆరేళ్ల కుమారుడికి ఉరేసిన తల్లి.. ఆపై..

women kills son in yadadri

ఆరేళ్ల కుమారుడికి ఉరేసిందో తల్లి. ఆ తర్వాత తాను బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా లంగోటం గ్రామంలో చోటు చేసుకుంది. ఉమా మహేశ్వరికి ఆరేళ్ల కుమారుడు పునీత్‌ ఉన్నాడు. అయితే అతనిలో మానసిక ఎదుగుదల లేకపోవడంతో ఆమె కుంగిపోయింది. తనకు ఎందుకిలా జరిగిందని తరచు బాధపడుతుండేది. ఈ క్రమంలో ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పునీత్‌కు ఉరి వేసినట్టు స్థానికులు చెప్తున్నారు. తర్వాత తాను కూడా ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ దారుణాన్ని గమనించిన భర్త వెంటనే చౌటుప్పల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఇద్దరికీ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు.. విషమంగా ఉందని చెప్పారు హైదరాబాద్‌ తీసుకెళ్లాలని సూచించారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.